Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలై 2022లో పంట నష్టపోయిన రైతుల పరిస్థితి ఏంటి?: రైతు స్వరాజ్య వేదిక ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు ఇవ్వడాన్ని స్వాగిస్తున్నామని రైతు స్వరాజ్య వేదిక నాయకులు చెప్పారు. కానీ జూలై 2022లో భారీ వర్షాలకు దెబ్బతిని వేల కోట్లు నష్టపోయిన తమ పరిస్థితి ఏంటిని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సాయం చేయరా? అంటూ బాధితుల పక్షాన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రైతు స్వరాజ్యవేదిక నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రకతి వైపరీత్యాల బాధిత రైతులు, కౌలు రైతులు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి. కొండలరెడ్డి, కన్నెగంటి రవి, ఎస్. ఆశాలత మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల పంట నష్టానికి సంబంధించి పోస్టర్ల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కౌలు రైతుల ప్రస్తావన తెచ్చారని గుర్తు చేశారు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతుల గుర్తింపుపై విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత మూడేండ్లలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనీ, పటిష్టమైన పంట బీమా పథకం అమలు చేయాలని కోరారు. గత మూడేండ్లలో తీవ్ర పంట నష్టాన్ని చవిచూసిన దుర్గారెడ్డి, బాలయ్య, కుసుమ సంద్రం రమేష్ తమ ఆవేదన వ్యక్తం చేశారు.