Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచశాంతి ముద్దు
- చిన్నారుల చిరు సందేశం
హైదరాబాద్ : ప్రపంచ శాంతి, ఆనందం, స్థిరమైన భవిష్యత్తు ప్రాధాన్యతను తెలియజేస్తూ గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు చిరు సందేశాన్ని పంపారు. ఐదో తరగతికి చెందిన యెలమర్తి ఆరాధ్య, సాయి సూర్యదేవర, అవ్యుక్త్ సూర్పనేని, లక్ష్ అగర్వాల్‌లు కరపత్రాలతో డ్రైవ్‌ను చేపట్టారు. జీవాయుధాలు వద్దనీ, ప్రపంచ శాంతి ముఖ్యమనే సందేశాన్ని వారు ప్రచారం చేశారు. యుద్ధాలు, జీవాయుధాల ద్వారా వచ్చే నష్టం గురించి పలువురికి చిన్నారులు వివరించారు. ప్రత్యేక టీషర్టులు ధరించిన చిన్నారులు.. ఈ కరపత్రాలను వారికి అందించారు. చిన్నారుల ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.