Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌కు భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డీజీపీ అంజనీ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ డీజీపీకి లేఖ రాశారు. డి.శ్రీనివాస్‌కు ఆయన కుమారుడు డి.సంజరుకు మధ్య జరిగినట్టుగా ప్రచారంలోకి వచ్చిన సంభాషణ ద్వారా డీఎస్ వేధింపుల మధ్య ఉన్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఆ సంభాషణలో డీఎస్ స్వయంగా తాను వేధింపులకు లోనవుతున్నట్టు చెప్పుకున్నారని గుర్తుచేశారు.