Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ నిర్వహణకు కోల్ ఇండియా ఆర్థిక సహాయాన్ని అందచేసింది. ఆ విభాగం అధ్యాపకుల జీతాల కోసం రూ.3 కోట్లు డిపాజిట్ చేసింది. దీనికి సంబంధించిన ఎమ్ఓయూపై ఓయూ వైస్ చాన్సలర్ డీ రవీందర్, కోల్ ఇండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్ సోమవారం సంతకాలు చేశారు. పూర్వ విద్యార్థుల పట్టుదలతో ఇది సాధ్యమైందని వారు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాన్ని పునరుద్ధరించి, బీటెక్, ఎంటెక్ కోర్సులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఉస్మానియా మాజీ విద్యార్థి, ప్రస్తుత కోలిండియా డైరెక్టర్ టెక్నికల్ బి వీరారెడ్డి పాల్గొన్నారు.