Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ హబ్‌గా హైదరాబాద్ గుర్తింపు కొనసాగించడంలో నాణ్యమైన వైద్యం అందించడంపై దృష్టి సారించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ కొండాపూర్‌లో ఆయన శ్రీనిధి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఆయన ప్రారంభించారు. మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ అందిస్తున్న సేవలకు ఇలాంటి ఆస్పత్రుల రాక తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనిధి హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ రవి వర్మ భూపతి, డాక్టర్ జ్యోత్స్న భూపతి రాజు మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని తెలిపారు. 25 ఏండ్లుగా రోగులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
నేడు మాతా, శిశు ఆస్పత్రికి శంకుస్థాపన
200 పడకలతో హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో నిర్మించనున్న ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రికి మంగళవారం ఉదయం 11 గంటలకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు వంద బెడ్ల డయాలసిస్ యూనిట్‌ను, ఎంఆర్ఐ మిషన్ ప్రారంభించడంతో పాటు నిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో కొత్తగా నియమితులైన 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను మంత్రి అందజేయనున్నారు.
28.74 శాతం మందికి కండ్లద్దాలు
రాష్ట్రంలో కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం కింద సోమవారం నాటికి 90,42,784 మందికి పరీక్షలు నిర్వహించారు.