Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : డీజీపీ కార్యాలయంలో మూడ్రోజుల పాటు జరిగే వైద్య శిబిరాన్ని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడ్రోజుల పాటు పోలీసు అధికారులు, సిబ్బందికి 11 రకాల వ్యాధులపై పరీక్షలను నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆర్థోపెడిక్, షుగర్, బీపీ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.