Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ అధికారులను నిర్బంధించి తాళం వేసిన బాధితులు
నవతెలంగాణ-వర్ని
కెనరా బ్యాంక్లో పీడీ అకౌంట్ ఖాతాదారుల డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని బ్యాంక్ ఎదుట సోమవారం ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. బ్యాంకుకు తాళం వేసి బైటాయించారు. అ సందర్భంగా బాధితులు రామకృష్ణ, రఘు, బాబుమియ్య మాట్లాడుతూ.. బ్యాంక్ అధికారులు 45 మంది పీడీ ఖాతాదారులకు చెందిన సుమారు రూ.40 లక్షలను బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సునీల్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సుమా ప్రసన్న, పీడీ ఏజెంటు శ్రీనివాసులు కలిసి కాజేశారని ఆరోపించారు. బ్యాంక్ అధికారులు విచారణ పేరిట రెండు నెలలుగా కాలయాపన చేస్తూ బాధితులకు డబ్బులు చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా, రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రతిరోజు బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకుంటూ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కెనరా బ్యాంకు ఏజీఎంతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులను బ్యాంకుకు పిలిపించి నేడు డబ్బులు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని బ్యాంక్ అధికారులు, పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.