Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థులతో ధీటైనా పోటీని ఎదుర్కొని పంచ్పవర్తో అద్భుత ప్రతిభను కనపరచి పసిడి పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిజామాబాదు జిల్లాకు చెందిన నిఖత్ విజయం తెలంగాణ క్రీడాకారులకే కాకుండా భారతదేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా నిఖత్ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి,వారికి అవసరమైన శిక్షణనిచ్చి క్రీడారంగంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఆవాజ్ అభినందనలు
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థులతో ధీటైన పోటీని ఎదుర్కొని పంచ్పవర్తో అద్భుత ప్రతిభను కనపరచి పసిడి పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్‌కు ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశం తరుపున మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిజామాబాదుకు చెందిన నిఖత్ విజయం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు భారతదేశానికే గర్వకారణం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నికత్ జరీన్ ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగడం హర్షనీయమని పేర్కొన్నారు. నిఖత్ ఎదుగుదలకు చేయూత నిచ్చిన కుటుంబానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిఖత్ ఇంకా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి క్రీడారంగంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు.