Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ) ఛైర్‌పర్సన్‌గా రీతూ షా నియామకమయ్యారు. ఆమె క్రీమ్ స్టోన్, స్కూప్స్ ఐస్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. ఎఫ్ఎల్ఒ 22వ చైర్‌పర్సన్‌గా రీతూ షా 2023-2024 కాలానికి నిర్వర్తించనున్నారు. ఫిక్కీకి చెందిన మహిళ విభాగానికి దేశ వ్యాప్తంగా 19 స్థానిక చాప్టర్లు ఉన్నాయి. 8000 మంది మహిళా వ్యాపారవేత్తలు, నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎఫ్ఎల్ఒకు గౌరవ కార్యదర్శిగా ప్రాచీ త్రివేది షా, కోశాధికారిగా నిషితా మన్నె, గౌరవ జాయింట్ సెక్రటరీ స్మితా సంఘి, జాయింట్ ట్రెజరర్‌గా నీరూ మోహన్ ఎన్నికయ్యారు. అదే విధంగా యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్‌గా ఆర్తీ షా నియమితులయ్యారు. శ్రీ శ్రీనివాస డైరీ ప్రొడక్ట్స్ భాగస్వామిగా రీతూ షా ఉన్నారు. ''మహిళలు మరింత ఉపాధి పొందేలా, మార్కెట్లలో రాణించేలా చేయడం నా లక్ష్యం. డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత కోసం కార్యక్రమాలను ప్లాన్ చేసి అమలు చేయడమే నా లక్ష్యం.'' అని రీతూ షా పేర్కొన్నారు.