Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ టీచర్‌కు ఉద్యోగమిచ్చిన జగిత్యాల డీఈవో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి ఎంపీపీఎస్‌లో పనిచేసిన టి శ్రీనివాస్ అనే టీచర్ 2003, సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే 20 ఏండ్లపాటు విధులకు హాజరు కాలేదు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. అయినప్పటికీ జగిత్యాల డీఈవో బి మదన్మోహన్ ఆయనకు ఉద్యోగమివ్వడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటికొండాపూర్ ఎంపీయూపీఎస్‌లో ఆయనకు పోస్టింగ్ ఇస్తూ గతనెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే క్లాసిఫికేషన్, కంట్రోల్ అప్పీల్ (సీసీఏ) రూల్ ప్రకారం ఓ ఉద్యోగి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతితో గరిష్టంగా ఐదేండ్లపాటు సెలవు తీసుకునే అవకాశమున్నది. అధికారులకు చెప్పకుండా ఏడాదిపాటు విధులకు గైర్హాజరైతే ఆ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ 20 ఏండ్లపాటు విధుల్లో లేకపోయినా టి శ్రీనివాస్ అనే టీచర్‌కు మళ్లీ ఉద్యోగమివ్వడం గమనార్హం.