Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్టీయూ హైదరాబాద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు 2023-24 విద్యాసంవత్సరంలో అనుబంధ గుర్తింపు కోసం వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. ఈ మేరకు ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ఎం మంజూర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు వచ్చేనెల 15వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఫారం 123ని అప్లోడ్ చేయాలని వివరించారు. విద్యాసంస్థలు www.jntuhaac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సందేహాల కోసం 8008421860 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.
జీతాలివ్వని కాలేజీలపై దృష్టిసారించండి
జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని సాంకేతిక కాలేజీలు అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ తెలిపారు. ఆయా కాలేజీలపై అధికారులు దృష్టిసారించాలని కోరారు. వేతన సంఘం సిఫారసులను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిని ఎక్కడా అమలు చేయడం లేదని తెలిపారు. గ్రూప్ ఇన్సూరెన్స్ లేదనీ, ఫైర్ సేఫ్టీ, హెచ్ఎండీఏ అనుమతుల్లేవనీ విమర్శించారు. నిబంధనలు పాటించని ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.