Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డీఎస్ఎస్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్‌తో కలిసి దళిత బందుపై సమీక్ష నిర్వహించారు. దళిత బంధు అమలు తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవల్లో తిరిగి పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కింది స్థాయిలో దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం ఉందని తెలిపారు.అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఇడీలు క్షేత్ర స్థాయిలో తిరిగాలనీ, లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నెల నెలా ఆదాయం ఎంత వస్తుందో తెలుసుకోవాలన్నారు.