Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనదేవతల మొత్తం ఆదాయం రూ.1,02,60,605
నవతెలంగాణ -తాడ్వాయి
ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర సందర్భంగా సందర్శకులు హుండీలో సమర్పించిన నిధులు, విలువైన బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ, తదితరు కానుకలను మంగళవారం ఎండోమెంట్ ఈవో రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, రెవెన్యూ అధికారి సునీల్ ఆధ్వర్యంలో మేడారం ఎండోమెంట్ ఆవరణలో తాడ్వాయి కెనరా బ్యాంక్ శాఖ అధికారులు నేతృత్వంలో లెక్కించారు. సమ్మక్క వనదేవత హుండీ ఆదాయం రూ. 52,81,584. సారలమ్మ వనదేవత హుండీ ఆదాయం రూ. 46,34,211. పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ. 1,60,830. గోవిందరాజు హుండీ ఆదాయం రూ. 1,83,980. మొత్తం వనదేవతల ఆదాయం రూ.1,02,60,605. అమెరికా డాలర్లు 37, దినార్ 2 నోట్లు మొత్తం 39 విదేశీ కరెన్సీ నోట్లు, 15 తులాల బంగారం, సుమారు 8 కిలోల చిల్లర వెండి వచ్చినట్టు ఎండోమెంట్ ఈవో రాజేంద్రం ప్రకటించారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సివిల్ పోలీసుల పహారా మధ్యలో భారీ బందోబస్తు నడుమ హుండీల లెక్కింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ సూపరింటెండెంట్ క్రాంతి, అధికారులు జగదీష్, రాజేశ్వరరావు, బాలకృష్ణ, మధు, రమా, రఘుపతి, వీరన్న, అధికారులు, రెవిన్యూ అధికారి సునీల్, పూజారులు, ఎండోమెంట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.