Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముస్తాబాద్
ఒకే కాన్పులో ఒకరు ఇద్దరు పుట్టడం సహజం. కానీ నలుగురు జన్మించడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ ఆస్పత్రిలో జరిగింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలి పారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్‌కు చెందిన గొట్టేముక్కల లావణ్యకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు(ముగ్గురు మగ, ఒక ఆడపిల్ల) జన్మించారు. మొదటి నెల నుంచి కూడా పీపుల్స్ ఆస్పత్రిలోనే లావణ్యకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశామని వైద్యులు శంకర్, అఖిల, తేజస్వి తెలిపారు. పది లక్షల మందిలో ఒకరికి ఇలా ఒకే కాన్పులో నలుగురు జన్మించే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం నలుగురు పిల్లలను సిద్ధిపేటలోని పిల్లల ఆస్పత్రికి పంపించినట్టు తెలిపారు.