Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2021 బ్యాచ్ కోసం అమలు చేస్తున్న డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం కోసం పీజీలను వారి సొంత జిల్లాలు లేదా చదువుకుంటున్న కాలేజీ సమీపంలో 30 కిలోమీటర్ల లోపు కేటాయించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) సూచించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కౌశిక్ కుమార్ పింజరాల, డాక్టర్ ఆర్.కె.అఖిల్ కుమార్ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరిన మేరకు తాము సూచనలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రుల కేటాయింపు, కౌన్సిలింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మోడల్‌ను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించి వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు.