Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో చర్యలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
హైదరాబాద్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులపై ఎన్ఐఏ అధికారులు చార్జీషీట్ను దాఖలు చేశారు. 2002లో నాగ్పూర్ జాతీయ రహదారి సమీపంలోని మనోహరాబాద్ వద్ద నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆధారంగా చేసుకొని దర్యాప్తును ముందుకు సాగించిన పోలీసు అధికారులు వాటిని అక్కడ పెట్టింది వాజీద్ అనే వ్యక్తిగా గుర్తించి అరెస్టు చేశారు. తర్వాత ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ఎన్ఐఏ అధికారులు మరో ఇద్దరు వాజీద్ అనుచరులు షమీ, మాస్ లను అరెస్టు చేశారు. వీరిని విచారించగా పాకిస్థాన్లో ఉన్న ఫరకుల్లా ఘోరీ ద్వారా వీరికి హైదరాబాద్లో బాంబులు పేల్చడానికి తగిన డబ్బులు అందాయని తేలింది.
అంతేగాక, ఎల్ఈటీకి చెందిన ఫరకూల్లా ఘోరీ ద్వారా ప్రేరేపితులైన ఈ ముగ్గురు ఉగ్రవాదులు దేశంలో విధ్వంస రచనకు కుట్ర పన్నినట్టు తేలింది. అలాగే, 2002లో హైదరాబాద్లో జన సమ్మర్థమైన ప్రాంతాల్లో హ్యాండ్ గ్రెనేడ్లను పేల్చడం ద్వారా భారీ ఎత్తున మత కలహాలకు కుట్ర పన్నినట్టు కూడా తేలింది. ఈ కేసులో విచారణను పూర్తి చేసిన అధికారులు ఈ ముగ్గురు ఉగ్రవాదులపై చార్జీషీటును దాఖలు చేశార