Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి (ట్రైన్ నెంబర్ 07489) కి ఏప్రిల్ 7, 14 తేదీల్లో (శుక్రవారాలు) రాత్రి 8 గంటల 10 నిముషాలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే తిరుపతి ఊనుంచి సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07490)కి ఏప్రిల్ 9, 16 తేదీల్లో (ఆదివారాలు) అక్కడి నుంచి సాయంత్రం 6.35 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 6.25కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. ఏపీ టూ టైర్, త్రీ టైర్, స్లీపర్‌తో పాటు జనరల్ సెకండ్‌క్లాస్ కోచ్‌లు ఈ రైళ్లలో ఉంటాయని తెలిపారు.