Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన కవిత న్యాయవాది సోమా భరత్
న్యూఢిల్లీ : ఎమ్మెల్సీ కవిత న్యాయవాది సోమా భరత్ బుధవారం కూడా ఈడీ ముందు హాజరయ్యారు. కవిత ఫోన్ల నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ తాజాగా లేఖ రాసిన విషయం విదితమే. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. కవిత తరపున ఈడీ కార్యాలయానికి బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వరుసగా రెండో రోజు కూడా వెళ్లారు. బుధవారం కూడా ఫోన్లలో సమాచారాన్ని సేకరిస్తుండటంతో భరత్ హాజరయ్యారు. మరోవైపు కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. కొన్ని గంటల పాటు బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎమ్మెల్సీ కవిత మొబైల్స్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, వ్యాపార లావాదేవీల గురించి ఈడీ ఆరాతీసినట్టు తెలిసింది.