Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని అలిండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఏఐఐపీఏ), ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఆర్ఈఏ)లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ సైఫాబాద్‌లోని జోనల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ మెరుగుదల నోటిఫికేషన్‌ను తక్షణం విడుదల చేయాలని కోరారు. పెన్షన్‌ను అప్డేషన్ చేయాలనీ, నూతన పెన్షన్ పథకాన్ని (ఎన్పీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ పెన్షన్‌ను 30 శాతం పెంచుతూ 2019లో కేంద్రం ప్రకటించి, జాతీయ బ్యాంకులు,ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో అమలు చేస్తున్నదనీ, కేవలం ఇన్సూరెన్స్ సంస్థల్లోని రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప చేయట్లేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఉద్యోగుల ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఐపీఏ హైదరాబాద్ జోనల్ సెక్రటరీ పీవీఎన్ఎస్ రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, ఐసీఆర్ఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ ఆదిష్రెడ్డి, గోవింద్ పటాంకర్ తదితరులు పాల్గొన్నారు.