Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాల్‌టికెట్ చూపించాలని మంత్రి సబిత విజ్ఞప్తి
- ఏప్రిల్ 3 నుంచి పది పరీక్షలు
- హాజరు కానున్న 4,94,620 మంది
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చేనెల మూడో తేదీ నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి హాల్ టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామని వివరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని కోరారు. విద్యార్థులకున్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత యాజమాన్యాలతోపాటు అధ్యాప కులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. వారి కోసం 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నందున, పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసర మైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ను అందుబాటులో ఉంచాలని కోరారు. విద్యార్థులకు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సౌక ర్యాలు కల్పించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష లు సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షల సమయంలో విద్యుత్‌కి ఆటంకం కలగకుండా నిరం తరం ఉండేలా చూడాలని ఆదేశించారు. హాల్ టికెట్లను సంబంధిత పాఠశాలలకు ఇప్పటికే పంపిం చామనీ, విద్యార్థులే స్వయంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశమూ కల్పించామనీ వివరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పేపర్లను 11 నుంచి ఆరుకు కుదించామని అన్నారు. సైన్స్ పరీక్ష రోజున భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంకు సంబంధించి ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలను విడివిడిగా అంది స్తామన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వారు చదివిన పాఠశాలలకు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా పరిశీల కులను నియమిస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించడంతో పాటు ప్రత్యేక మెనూ అమలు చేశామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకు రాలు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.