Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదిలొచ్చిన ఎర్రదండు
- ఇందిరాపార్కు ఎరుపుమయం
- ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
- జనచైతన్య యాత్ర ముగింపు సభ సక్సెస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ఎర్ర దండు కదంతొక్కింది. జన చైతన్యమై ఉప్పొంగింది. ''ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని... ఎవ్వడురా కూసింది ఎర్ర జెండా నేలకొరి గిందని... తూర్పున సూర్యుడు పొడిచి నంత కాలం..మనిషిలో రక్తం ఉన్నంత వరకు.. అజేయం విప్లవం - అజేయం సోషలిజం.. దానిని ఆపడం ఎవడబ్బతరం'' అని కమ్యూనిజం గొప్పతనాన్ని చాటిచెప్పిన కవి వాక్కుల్ని నిజం చేస్తూ ధర్నాచౌక్ జన సంద్రమైంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన సీపీఐ(ఎం) కార్యకర్తలు అందుకు అను గుణంగా రెడ్టీషర్ట్సు, టోపీలు, ఎర్రజెం డాలతో సభాస్థలికి చేరుకున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, కరీంగనర్, వన పర్తి వంటి సుదూర ప్రాంతాల నుంచి సద్ది మూటలతో తెల్లవారు జామున్నే చేరు కున్నారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ వ్యతిరేక విధానాలపై రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించిన మూడు జన చైతన్య యాత్ర బృందాలు.. మూడువైపుల నుంచి ర్యాలీగా హైదరాబాద్‌కు చేరుకున్నాయి.
వందలాది బైకులతో ర్యాలీగా సాగిన ఈ యాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా మహిళలు, యువత, విద్యా ర్థులు, కష్టజీవులు భారీగా తరలొచ్చారు.
ఉక్కపోత ఉన్నప్పటికీ కార్యకర్తలు, ప్రజలు సభ ముగిసేదాక కూర్చోవడంతో సీపీఐ(ఎం) క్యాడర్ క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ కొనియాడారు. జన చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది.
ఆకట్టుకున్న పీఎన్ఎమ్ కళారూపాలు.. రాకేశ్ మాష్టార్ చిందులు
జనచైతన్య యాత్ర ముగింపు సభలో ప్రజానాట్యమండలి కళారూపాలు సభికుల్ని ఆకట్టుకున్నాయి. బ్రిటీష్ సర్కారు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీసే సన్నివేశాన్ని ప్రదర్శిస్తూ పాడిన పాట వారి పోరాట స్ఫూర్తిని గుర్తుచేసింది. వారిలోని నిజమైన దేశభక్తిని చాటిచెప్పింది. ''ఏ చారువాలా.. చారువాలా..దేశానికి లూటీవాలా...'', ''ఇంకా ఏందిర చూసుడు..బంజెరురా చేతులు పిసుకుడు...'' అంటూ పీఎన్ఎమ్ కళాకారులు పాడిన పాటలకు డ్యాన్స్ మాష్టర్ రాకేశ్ మాష్టార్ వేసిన చిందులు సభికుల్ని ఉత్తేజపరిచాయి. పీఎన్ఎమ్ రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ, అధ్యక్షులు ఆనంద్ నేతృత్వంలో కళాకారులు తమ ఆటపాటల్ని ప్రదర్శించారు.
హైదరాబాద్‌లో ముగిసిన జన చైతన్య యాత్రలు
నగరంలో పెద్దఎత్తున బైక్ ర్యాలీలు
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధా నాలకు వ్యతిరేకంగా, సంక్షేమం మతసా మరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో సీపీఐ(ఎం) ఈ నెల 17 నుంచి చేపట్టిన మూడు జనచైతన్య యాత్రలు బుధవారం హైదరాబాద్‌లో ముగిశాయి. యాత్రలకు పెద్దఎత్తున బైక్ ర్యాలీల స్వాగతంతో హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. ఇందిరాపార్క్ వద్ద జన చైతన్య యాత్ర ముగింపు సభ వద్దకు యాత్రలు చేరుకున్నాయి.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు నేతృత్వంలో సాగిన యాత్ర బుధవారం తుర్కయంజాల్ నుంచి సాగింది. రాగన్నగూడలోని రాజీవ్ గృహకల్పలో పార్టీ జెండాను సుదర్శన్‌రావు ఆవిష్క రించారు. అనంతరం తుర్కయంజాల్ చౌరస్తా వద్ద జరిగిన సభలో వారు మాట్లా డారు. నాగార్జునసాగర్ రహదారిపై వందలాది బైకులతో రోడ్డు షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్ తదితరులు పాల్గొ న్నారు. అనంతరం యాత్ర అబ్దుల్లాపూర్ మెట్, హయత్‌నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట్ మీదుగా కోఠి చేరుకుంది. కోఠి ఉమెన్స్ కళాశాల వద్ద సీపీఐ(ఎం) సౌత్ జిల్లా నాయకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత యాత్ర ఇందిరా పార్క్ వద్ద సభాస్థలికి చేరుకుంది.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య నేతృత్వంలో సాగిన మరో జనచైతన్య యాత్ర ఈసీఐఎల్‌లో ప్రారంభమై లాలాపేటకు చేరుకుంది. అక్కడ ఈ యాత్రకు సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం తార్నాక, చిలకలగూడ, మూషీరాబాద్ మీదుగా ఇందిరాపార్క్ వద్దకు చేరుకుంది. జాన్‌వెస్లీ నేతృత్వంలో సాగిన మరో జనచైతన్య యాత్ర చాంద్రాయణగుట్టలో ప్రారంభమై చార్మినార్, అప్జల్ గంజ్, గాంధీభవన్ మీదుగా ఇందిరాపార్క్ వద్ద బహిరంగసభకు చేరుకుంది.