Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు కుటుంబాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. బుధవారం ఆయన సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో జయరాజు, ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. జయరాజు కుమారుడు ప్రశాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న తమ్మినేని అదే రోజు జయరాజుకు ఫోన్ చేసి ఓదార్చారు. జన చైతన్య యాత్రలో ఉన్న తమ్మినేని హైదరాబాద్లో జరిగిన ముగింపు సభ అనంతరం నేరుగా సంగారెడ్డికి వచ్చారు. ప్రశాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు. జయరాజు కుమారుడు అకాల మరణం కుటుంబానికి తీరని లోటన్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. జయరాజును పరామర్శించిన వారిలో తమ్మినేని వీరభద్రంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, టి. జ్యోతి, టి.సాగర్, మల్లు లక్ష్మీ, అబ్బాస్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు, సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, ఎ.మాణిక్, జి.సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు యాదవరెడ్డి ఉన్నారు.