Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురి పరిస్థితి విషమం
నవాతెలంగాణ - వెంకటాపురం
కలుషిత నీరు తాగి 25మంది కూలీలు అస్వస్థతకు గురవ్వగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు, గొల్లగూడెం గ్రామాల్లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పెడు, గొల్లగూడెం గ్రామాలకు చెందిన 25మంది కూలీలు సమీపంలో ఉన్న శాంతమూర్తికి చెందిన మిర్చి తోట వద్దకు పనికి వెళ్లారు. భోజన సమయంలో సమీపంలోని మరో రైతు పొలం వద్దకు వెళ్లి నీరు సేకరించి తాగారు. దాంతో పలువురు వాంతులు చేసుకోవడంతోపాటు అస్వస్థతకు గురయ్యారు. మిగిలిన రైతులు ఆరా తీయగా డ్రిప్ పైపులను శుభ్రం చేసేందుకు పాస్పరిక్ యాసిడ్ అనే రసాయనమందు ఉపయోగించారని, ఆపైపుల గుండానే నీరు వదిలినట్టు తేలింది. అదే నీటిని కూలీలు తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు రావడంతో భయాందోళనకు గురైన 25 మంది కూలీలు దొరికిన వాహనాల్లో వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. వారికి వైద్యులు వెంటనే చికిత్స అందించారు. ఇందులో ఎం. రమణ, కె. రమణతోపాటు మరొకరికి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం ములుగు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.