Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖుల ఫొటోల మార్ఫింగ్
- 20 మందిపై కేసులు నమోదు
- 8 మందికి నోటీసులు జారీ చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖులను టార్గెట్ చేసుకుని వారిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న 20 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 8 మందికి నోటీసులు జారీ చేశారు. బుధవారం సీఐ దశ్రు, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా మీడియాతో వివరాలు వెల్లడించారు. రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమలకు చెందిన వారితోపాటు పేరు ప్రతిష్టలు కలిగిన ప్రముఖులను, మహిళలను కించపరిచే విధంగా కొందరు సోషల్‌మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, మరికొందరు మార్ఫింగ్ చేసిన వీడియోలను పోస్టు చేస్తున్నారని చెప్పారు. టీఆర్పీ రేట్లను పెంచుకోవడంతోపాటు వ్యూస్ పెంచుకునే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గ్రూపుల్లో వచ్చిన వీడియోలు, కథనాల్లో వాస్తవాలను పరిశీలించుకోకుండానే గ్రూప్ సభ్యులు వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నారని, లైక్ కొడుతున్నారని తెలిపారు. కొన్ని యూట్యూబ్ చానళ్లు, మరికొన్ని టీవీ చానళ్లు సైతం సెలబ్రెటీల వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నాయని చెప్పారు. ఫొటో, వీడియోల మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, వాట్సాప్, యూట్యూబ్, టీవీ చానళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపారు. మహిళలను కించపరిచేలా ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఇప్పటి వరకు 20 మందిపై కేసులు నమోదు చేయగా, మరో 8 మం దికి 41 (ఏ) నోటీ సులు జారీ చేసినట్టు తెలి పారు.