Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లూరల్ టెక్నాలజీ సీఈవో వెల్లడి
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో 1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్లూరల్ టెక్నాలజీ సిఇఒ సునీల్ సవరం తెలిపారు. అందులో 500 మంది జపనీస్ భాషలో శిక్షణ పొందు తారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2025 నాటికి ప్లూరల్ టెక్నాలజీ, ఒపెన్సెసమీ టెక్నలాజీ ఐఎన్సిలు కలిసి 100 మిలియన్ల వ్యాపారాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ప్లూరల్ టెక్నలాజీ, జపాన్లోని ఓపెన్ సెసేమ్ టెక్నాలజీ ఇటీవల ఆ దేశంలో తమతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ప్రస్తుతం రెండు కంపెనీలు కలిపి దాదాపు 500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయన్నారు. మరో 1000 మంది సాంకేతిక సలహాదారులను జోడించుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు.