Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థ గుర్తింపు కార్డు ఉన్నా చాలు..
- అలాంటి మహిళా జర్నలిస్టులందరికీ ఆరోగ్య పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో అక్రిడేషన్ కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులకే కాకుండా..అది లేకుండా, సంస్థ గుర్తింపు కార్డు ఉన్న వారికి కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ అర్వంద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ నవమి సందర్బంగా గురువారం సెలవు దినం కాబట్టి.. ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదనీ, శుక్రవారం నుంచి తిరిగి యదావిధిగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల తొమ్మిది వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటెడ్ మహిళా జర్నలిస్టులతోపాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే రక్త పరీక్ష, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ 12 డీ3 మొదలైనవి, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్దారణ పరీక్షలు ఉంటాయని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయనీ, పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.