Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెయ్యిరెట్లు పెరిగిన ఆదాయం
- రికార్డు స్థాయిలో రవాణాశాఖ రెవెన్యూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రీన్‌టాక్స్ పేరుతో రవాణాశాఖ వాహనదారుల్ని భారీగా బాదేసింది. ఏకంగా వెయ్యి రెట్లు అదాయం పెరిగేలా గ్రీన్‌టాక్స్‌ను పెంచేసి, వసూలు చేశారు. అది కడితేనే వాహన రిజిస్ట్రేషన్ జరిగేలా రవాణాశాఖ వెబ్సెట్లో పొందుపర్చారు. దీనితో విధిలేక వాహనదారులు తిట్టుకుంటూనే గ్రీన్‌టాక్స్ కట్టి వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఏ వాహనానికి ఎంత గ్రీన్‌టాక్స్ కట్టాలో ఎక్కడా అధికారికంగా ప్రకటన లేదు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో కంప్యూటర్లో కాలమ్స్ నింపే క్రమంలో ఆటోమేటిక్ జనరేటింగ్ అమౌంట్ వచ్చేలా రవాణాశాఖ అప్లికేషన్ రూపొందించింది. దీనితో 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్‌టాక్స్ ఆదాయం 1067.41 శాతం పెరిగింది. 2021-22లో గ్రీన్‌టాక్స్ ఆదాయం రూ.5.54 కోట్లు కాగా, 2022-23లో ఆ ఆదాయం రూ.64.63 కోట్లకు (1067.41 శాతం) పెరిగింది.
2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రవాణాశాఖ పన్నుల్ని భారీగా పెంచేసింది. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3,971.38 కోట్ల ఆదాయం వస్తే, 2022-23లో ఈ ఆదాయం రూ.6,390.80 కోట్లకు పెరిగింది. 60.92 శాతం అధిక ఆదాయం సమకూరింది. వాస్తవానికి 2022-23లో రవాణాశాఖ ఆదాయ లక్ష్యం రూ.4,953 కోట్లుగా అంచనా వేశారు. కానీ పెరిగిన పన్నులతో అంతకు మించి ఆదాయం సమకూరింది.
పెరిగిన ఆర్టీసీ టిక్కెట్ ధరలు
- టోల్ చార్జీల భారం ప్రయాణీకులపైనే...
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ చార్జీలను ఐదు శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ ప్రయాణీకులపై పడింది. దీన్ని అవకాశంగా తీసుకొని టీఎస్ఆర్టీసీ టిక్కెట్ రేట్లను పెంచింది. పెరిగిన చార్జీలు తక్షణం అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటించింది. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీల ను రూ.4 వరకు పెంచినట్టు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో చార్జీని రూ.15 పెంచారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయా ణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో టిక్కెట్ రేటును అదనంగా రూ.4 పెంచారు.