Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బందెల నరసయ్య, మారుపాక అనిల్‌కుమార్ ఎన్నికయ్యారు. ఆ సంఘం ప్రథమ మహాసభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అందులో నూతన రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నామని ఆ సంస్థ గౌరవధ్యక్షులు కె. ఏసురత్నం తెలిపారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభలో కార్యనిర్వహణ అధ్యక్షులుగా తాళ్లపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా కే రత్నకుమారి, రాజరత్నం, సహదేవ్, దేవి పోషన్న, సహాయ కార్యదర్శులుగా ఉషశ్రీ, లక్ష్మీపతి, వెంకటస్వామి, జె.కుమారస్వామి, సలిగంటి శ్రీనివాస్, కోశాధికారి ఆరుట్ల రాజ్ కుమార్ తోపాటు 35 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, 81 మంది రాష్ట్ర సమితి సభ్యులుగా ఈ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.