Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి మహిళ పేరును కీలక పదవికి సిఫారసు చేశారు. ఫెడరల్ జడ్జిగా రూపా రంగా పుట్టగుంట పేరును నామినేట్ చేశారు. ఆఫ్రికన్ అమెరికన్, ముస్లిం అమెరికన్ అభ్యర్థులతో పాటు ఉన్నతన్యాయమూర్తుల పదవులకు ప్రతిపాదించిన పేర్లలో ఆమె కూడా ఉన్నారు. 10 ఫెడరల్ సర్క్యూట్, జిల్లా కోర్టు న్యాయమూర్తి స్థానాలకు, డిస్ట్రీక్ ఆఫ్ కొలంబియా(డీసీ) సుపీరియర్కోర్టు జడ్జి పదవులకు బైడెన్ పేర్లను సిఫారసు చేశారు. ఆమెను డీసీ జిల్లా కోర్టు న్యాయమూర్తి పదవికి నామినేట్ చేసినట్లు సమాచారం. అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేసినట్లయితే.. డీసీ జిల్లా కోర్టుకు ఎంపికైన తొలి ఆసియా-ఆమెరికన్ , పసిఫిక్ ఐస్లాండ్ (ఏఏపీఐ) మహిళగా రూపా రంగా నిలిచిపోతారని వైట్ హౌస్ తెలిపింది. ప్రస్తుతం ఆమె రెంటల్ హౌసింగ్ కమిషన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 2019లో కమిషన్‌లో చేరడానికి ముందు, 2013-19 వరకు ప్రాక్టిషనర్‌గా క్రిమినల్ కేసులు వాదించేవారు.