Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాకు ముందు నుంచే భారత్‌లో మాంద్యం : ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్
వాషింగ్టన్ : కరోనా దెబ్బకు ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ బాగానే పుంజుకుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. అలాగని ఇంకా సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదని.. కష్టాల్లోనే ఉందని ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. వచ్చే జులై నుంచి డిసెంబర్ త్రైమాసికాల్లో దేశంలో ప్రయివేటు వినిమయం, పెట్టుబడులు పెరిగితే దేశ జిడిపి పెరుగొచ్చని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక మీటింగ్ త్వరలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు సౌత్ ఏసియన్ ఎకనామిక్ ఫోకస్ స్ప్రింగ్ 2021 రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేసింది. కరోనా చుట్టు ముట్టడానికి ముందే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని ఈ రిపోర్ట్ తెలిపింది. 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వద్ధి రేటు 8.3 శాతంగా ఉందని.. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది 4.0 శాతానికి తగ్గిందని గుర్తు చేసింది. వ్యక్తిగత వినియోగ వద్ధి క్షీణించడంతోపాటు ఆర్థిక రంగంలో ఒడుదొడుకులు, పెట్టుబడుల్లో అంతకుముందు నుంచి ఉన్న బలహీనతల కారణంగా ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని తెలిపింది. కరోనా మరోసారి పుంజుకుంటుండడం, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించడం ప్రస్తుతం భారత్ ముందున్న అతి పెద్ద సవాళ్లని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగంలో ప్రధాన ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు.