Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనా సమయంలో కొన్ని రకాల టెంపరరీ వర్కర్లకు హెచ్-1బీ వీసాలపై విధించిన నిషేధం తొలగిపోయింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం గత జూన్లో జారీ చేసిన నిషేధం ఉత్తర్వులను జారీ చేసింది. బుధవారంతో గడువు ముగియనున్న ఈ నిషేధాన్ని తిరిగి కొనసాగించరాదని బైడెన్ ప్రభుత్వం నిర్ణయిం చింది. అమెరికన్ టెక్నాలజీ కంపెనీలు హెచ్-1బీ వీసాలను ఉపయోగించుకుని ఇతర దేశాల నుంచి ఇంజినీర్లు, ఫారిన్ కోడర్స్ను రప్పించుకునేందుకు ఇప్పుడు లైన్ క్లియరైంది. హెచ్-1బీ వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగు రకాల స్టేటస్లు కనిపిస్తాయి. ''సబ్మిటెడ్(దరఖాస్తు చేసినవి), సెలక్టెడ్(ఎంపిక చేసినవి),
డినైడ్( తిరస్కరించినవి), ఇన్వాలిడేటెడ్-ఫెయిల్డ్ పేమెంట్(చెల్లనివి-విఫలమైన చెల్లింపు)'' అని వుంటాయి.