Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా : అధ్యక్షుడు జైర్ బోల్సనారోపై కొత్తగా అభిశంసనా తీర్మానం పెట్టనున్నట్టు ప్రతిపక్ష పార్టీల సభ్యులు బుధవారం తెలిపారు. బ్రెజిల్ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్, ఫెడరల్ సెనెట్కి చెందిన కొంతమంది సెనెటర్లు, డిప్యూటీలు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. దీంతో ఇప్పటివరకు అధ్యక్షుడిపై 68 అభిశం సనా అభ్యర్ధనలు పెండింగ్లో వున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలతో దేశంలో సైనిక బలగాలను దుర్వినియోగం చేయడానికి అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ప్రజాస్వామ్యానికి ఒక ముప్పుగా పరిణమిస్తున్నారని వారు పేర్కొన్నారు. రాజకీయ, వ్యక్తిగత, సామాజిక హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోనివ్వకుండా బోల్సనారో నేరానికి పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడానికి సైనిక సిబ్బందిని రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న కారణాలపై 1950ల నాటి చట్ట నిబంధనలు ఉపయోగించి వారు అధ్యక్షుడిపై చర్యకు దిగుతున్నారు. త్రివిధ దళాధిపతులు రాజీనామా చేసిన నేపథ్యంలో సైన్యం, నావికా, వైమానిక బలగాల కమాండ్ల్లో మార్పులు చేయాలని మంగళవారం బోల్సనారో నిర్ణయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాయుధ బలగాలను ఉపయోగించాలన్న అధ్యక్షుడితో విభేదించి రక్షణ మంత్రి రాజీనామా చేశారు.