Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వియన్నా : అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నందున ప్రస్తుత చమురు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా, అప్రమత్తంగా పరిశీలించాల్సి వుందని ఒపెక్ సభ్య దేశాలను కోరింది. గురువారం ఒపెక్, ఒపెక్యేతర గ్రూపు ఐదవ మంత్రిత్వ స్థాయి సమావేశం జరిగింది. మే నుండి జులై వరకు రోజుకు 20లక్షల బారెళ్ళకు పైగా చమురు ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ఒపెక్ ఈ సమావేశంలో అంగీకరించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో చమురు పరిశ్రమ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా రోజుకు ఉత్పత్తయ్యే బారెళ్ళ సంఖ్యను ఒపెక్ తగ్గించింది. న్యూయార్క్ మెర్కెంటైల్ ఎక్స్ఛేంజ్లో ముడి చమురు 3.6శాతం ఎక్కువగా, బ్యారెల్కు 51.28డాలర్లు వద్ద ట్రేడ్ అయిందని అసోసియేటెడ్ ప్రెస్ తన తాజా నివేదికలో పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ ధర కూడా 3.1శాతం పెరిగి 64.66 డాలర్లకు చేరింది. కాగా, డిమాండ్ ఇంకా అనిశ్చితిగానే వుందని ఒపెక్ సభ్య దేశాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఉత్పత్తి పెంచడం వలల్ల ధరలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ, తోసిపుచ్చలేని రీతిలో పునరుద్ధరణను సాధించేవరకు ఈ జాగరూకతతో కూడిన వైఖరే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇంకా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు.