Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యారికేడ్‌ను ధ్వంసం చేసిన కారు
- భద్రతాబలగాలపై కత్తితో దాడి..
వాషింగ్టన్ : భారతకాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి యూఎస్ పార్లమెంట్‌లోని క్యాపిటల్ హిల్ సమీపంలో కాల్పులు జరిగాయి. భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి కారుతో లోనికి ప్రవేశించటానికి ప్రయత్నించిన ఓ దుండగుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. కారు నుంచి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. ఇంటి లోపలే ఉండాలని పోలీసులు చుట్టు పక్కల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారు కిటికీ దగ్గర నిలబడకూడదని కూడా హెచ్చరికలు జారీచేశారు.
క్యాపిటల్ హిల్ మూసివేత
ఈ దాడి తర్వాత.. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు క్యాపిటల్ హిల్ కాంప్లెక్స్‌ను మూసి వేశారు. ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసివేశారు. ఆ పాంతమంతా భద్రతను పెంచారు. పోలీసులపై ఈ ఆకస్మిక దాడి గురించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ అమెరికాలో అత్యంత భద్రతాప్రాంతంలో కాల్పుల ఘటనపై అనేక పుకార్లు వినిపిస్తు న్నాయి. యూఎస్ క్యాపిటల్ అయిన వాషింగ్టన్ వీధుల్లో పెద్ద సంఖ్యలో నేషనల్ గార్డ్ దళాలు కవాతు చేస్తున్నాయి.పరిసరాల్లో అంబులెన్స్‌లు,హెలికాప్టర్లు కనిపించాయి.