Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 51మంది ప్రయాణికులు మృతి
- సొరంగమార్గంలో పట్టాలు తప్పిన రైలు
- సహాయకచర్యలకు ఆటంకం..
హువాలియన్ (తైవాన్): తూర్పు తైవాన్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. ఓ సోరంగంలో రైలు పట్టాలు తప్పటంతో 51 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. తైపీ నుంచి ఆగేయ నగరమైన టైతుంగ్ వరకు వెళ్తున్న ఈ రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పింది. రైలులో సుమారు 500 మంది ప్రయాణికులు ఉన్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. సుధీర్ఘవారాంతపు సెలవు (గుడ్ ఫ్రైడే) కావటంతో.. పర్యాటకులు, ఆయా ప్రాంతాలకు చెందిన చాలా మంది రైల్లో ప్రయాణిస్తున్నారు. మృతుల్లో రైలు డ్రైవర్ కూడా ఉన్నారు. రైలు ప్రమాదానికి గురైనపుడు ప్రయాణికుల ఆర్తనాదాలతో బోగీలన్నీ దద్దరిల్లాయి. తమను కాపాడాలంటూ వారు చేసిన కేకలు అరణ్యరోదనగా మారాయి. ప్రమాదం జరిగినస్థలం సొరంగంలో ఉండటంతో బయటకు రావటానికి కూడా సాధ్యంకాలేదని ప్రయాణికులు తెలిపారు.
2018లో తైవాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో రైలు పట్టాలు తప్పటంతో 18 మంది చనిపోగా, 175 మందికి గాయాలయ్యాయి. అంతకు ముందు 1981లో ఉత్తరాన జరిగిన ప్రమాదంలో 30 మంది, 1991లో మరోచోట జరిగిన రైలు యాక్సిడెంట్లో 30మంది మరణించారు. అయితే తాజాగా జరిగిన రైలు ప్రమాదం అత్యంత ఘోరమైనదిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. తైవాన్ సర్కారు నిర్వహణలో ఉన్న రైల్వేలు ఏండ్లుగా సురక్షితమైన భద్రతారికార్డు కలిగిఉన్నాయని నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనలపై విచారణ చేపట్టినట్టు తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది.