Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుండడంతో బంగ్లాదేశ్ తాజాగా లాక్డౌన్ విధించింది. సోమవారం రోజుల పాటు లాక్డౌన్ అమల్లో వుంటుందని శనివారం జరిగిన ఆన్లైన్ పత్రికా సమావేశంలో రవాణా శాఖ మంత్రి ప్రకటించారు. లాక్డౌన్ నుండి ఏ ఏ సర్వీసులు మినహాయించబడతాయో పేర్కొంటూ తాజాగా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ప్రజా పాలనా వ్యవహారాల శాఖ మంత్రి ఫర్హాద్ హుస్సేన్ తెలిపారు. ఫ్యాక్టరీలు తెరిచే వుంటాయని, పరిశుభ్రతా నిబంధనలను పాటిస్తూ కార్మికులు షిప్ట్‌ల వారీగా పనిచేసుకోవచ్చునని తెలిపారు. అన్ని ప్రభుత్వ రవాణా మార్గాలను నిలుపుచేస్తున్నందున ఇండ్లలోనే వుండాల్సిందిగా ప్రజలను కోరారు. విద్యా సంస్థలు కూడా గతేడాది మార్చి 17నుండి మూతపడ్డాయి. గతేడాది మార్చి 26న మొదటిసారిగా లాక్డౌన్ విధించారు. పరిస్థితి అధ్వాన్నంగా మారితే నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేస్తామని తెలిపారు. శుక్రవారం బంగ్లాదేశ్‌లో 6,830 కొత్త కేసులు నమోదయ్యాయి. 50మంది మరణించారు.