Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్‌లో ఏడుగురు మృతి
లండన్ : ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగంపై బ్రిటన్, యూరప్ దేశాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 మందిలో రక్తం గడ్డకట్టిన కేసులు వెలుగుచూడగా, వారిలో ఏడుగురు మరణించారు. ఈ మేరకు ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటర ఏజెన్సీ(ఎంహెచ్‌ఆర్‌ఎ) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 24 నాటికి బ్రిటన్‌లో 1.8 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా, వారిలో 30 మందికి రక్తం గడ్డకట్టడం చోటుచేసుకుంది. అయితే ఇది వ్యాక్సిన్ తీసుకోవడం వలనే జరిగిందా లేక యాదృ చ్ఛికంగా జరిగిందా అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలా స్వల్పమని ఎంహెచ్‌ఆర్‌ఎ తెలిపింది.
అయితే తాజా మరణాలు లేదా కేసులు యాధృచ్ఛికంగా జరగాయా అన్నదాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. అస్ట్రాజెనికా వినియోగం తర్వాత ఎదురౌతున్న దుష్ప్రరిణామాల నేపథ్యంలో పలు దేశాలు ఈవ్యాక్సిన్ వినియోగాన్ని ఆపేసిన విషయం తెలిసిందే. ఈదేశాల జాబితాలో నెదర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడాలు ఉన్నాయి. పలు ఇతర ప్రమాదాలను తమ వ్యాక్సిన్ ప్రయోజనాలు అధిగమించినట్లు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు పేర్కొన్నాయని అస్ట్రాజెనికా ఫార్మాస్యూటికల్ కంపెనీ తెలిపింది.