Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44 మంది మృతి
జకర్తా : శనివారం అర్ధరాత్రి కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడడం, ఆకస్మిక వరదలు రావ డంతో 44 మంది చనిపోయారు. వేలాది కుటుంబాలు నిరాశ్ర యులయ్యాయి. తూర్పు నుసా తెంఘారా రాష్ట్రంలోని లామెనెలా గ్రామంలో 50 ఇళ్లు ఈ వరదలో కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనిజాతీయ విపత్తు నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు. అనేక మంది గాయాల పాలయ్యారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. సహాయక చర్యల్లో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా, విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. 17,000 ద్వీపాల గొలుసు కట్టుగా ఉండే ఇండోనేషియాలో లక్షలాది మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో లేదా సారవంతమైన వరద మైదానాలకు సమీపంలో నివసిస్తున్నారు. పశ్చిమ జావా ప్రావిన్స్‌లో జనవరిలో రెండు కొండ చరియలు విరిగిపడి 40 మంది మరణించిన విషయం తెలిసిందే.