Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం అంతటా భారీ నిరసనలు
లండన్ : ప్రజాతంత్రయుతంగా చేపట్టే నిరస నలు, ఆందోళనలను కఠినంగా అణచివేసేందుకు బ్రిటన్‌లో బోరిస్‌జాన్సన్ ప్రభుత్వం ప్రతిపాదిం చిన బిల్లుపై పెద్దయెత్తున నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఈ బిల్లును రద్దు చేయాలని కోరుతూ లండన్‌లోనూ, బ్రిటన్‌లోని
మిగతా ప్రాంతా ల్లోను ప్రదర్శనలు హోరెత్తాయి. 'కిల్ ది బిల్', 'ప్రొటెక్ట్ అవర్ రైట్స్' ('బిల్లును రద్దు చేయండి', 'మా హక్కులను కాపాడండి') వంటి నినాదాలతో శనివారం లండన్‌తో సహా ఇంగ్లండ్, వేల్స్‌లోని 25కు పైగా నగరా ల్లో నిరసనలు జరిగాయి. వేలాది మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. లండన్‌లో క్యాపిటల్ హైడే పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తి, నిబంధ నల దృష్ట్యా నిరసనల్లో ప్రజలు పాల్గొనవద్దని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం విశేషం. నిరసనల్లో పాల్గొన్నవారిపై జరి మానాలు విధిస్తామని, కేసులు నమోదు చేస్తామనే పోలీసులు బెదిరింపులకు సైతం దిగారు. అయినా ప్రజలు వాటిని ఖాతరు చేయలేదు. రెట్టించిన పట్టుద లతో వేల సంఖ్యలో నిరసనల్లో పాల్గొన్నారు. మార్చి 16 న హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ బిల్లును ఆమోదించారు. ఈ నూతన నేర చట్టం ప్రజల నిరసనల శిక్షను పటిష్టంచేస్తూ, ప్రజా నిరసనలన్నింటినీ పరిమితం చేయడానికి, నియంత్రించ డానికి పోలీసులకు అదనపు అధికారాలను ఇస్తుంది. నిరసనల సమయం, శబ్ధ పరిమితులను పోలీసులే నిర్ణయిస్తారు. ఇతరులకు 'అన్యాయమైన అంతరాయం, బాధ' కలిగించే చర్యలను తగ్గించడమే ఈ చట్టం ఉద్దేశమని ప్రభుత్వం వాది స్తుంది. వాతావరణ మార్పు సంస్థ 'ఎక్స్‌టెంక్షన్ రివోల్ట్' (ఎక్స్ఆర్), బ్లాక్ లైవ్స్ మేటర్ (బీఎల్ఎం) నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.