Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హనోయ్ : వియత్నాం కమ్యూనిస్టు పార్టీ సంస్థాగత కమిషన్ చైర్మన్‌గా వున్న మిన్ చిన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. నేషనల్ అసెంబ్లీ సమావేశానికి హాజరైన 466మంది సభ్యులకు గానూ 462మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ దేశ ప్రధానిగా దేశానికి, ప్రజలకు, రాజ్యాంగానికి విశ్వాసపాత్రుడనై వుంటానని ఆయన ప్రమాణం చేశారు. పార్టీ, దేశం, ప్రజలు తనకప్పగించిన కర్తవ్యాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 1958లో జన్మించిన చిన్ క్వాంగ్ నిన్ ప్రావిన్షియల్ పార్టీ కమిటీ కార్యదర్శిగా, ప్రజాభద్రతా శాఖ డిప్యూటీ మంత్రిగా పలు బాధ్యతలు నిర్వహించారు. 2021-2026 కాలానికి కొత్త పార్లమెంట్‌ను ఎన్నుకోవడానికి వచ్చే నెల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగా 14వ నేషనల్ అసెంబ్లీ తన చివరి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది.