Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్‌తో అంతా తారుమారు
- మహిళలు, యువత, కార్మికులపై తీవ్ర ప్రభావం
- కార్మికశక్తిలో దిగజారిన మహిళల ప్రాతినిథ్యం: ఐఎంఎఫ్
వాషింగ్టన్ : ప్రకృతివిపత్తులా విరుచుకుపడిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. కాస్తా తగ్గుముఖంపట్టిందనుకుంటే.. సెకండ్‌వేవ్ విజృంభిస్తున్నది. వైరస్ బారినపడి లక్షలాది మంది మృత్యుఒడిలోకి చేరుకుంటుంటే మరోవైపు దీని ప్రభావం సమాజంలో వివిధ వర్గాల్లో వివిధ రకాలుగా ఉన్నది. ముఖ్యంగా మహిళలు, యువత, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొంది. అభి వృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో యువత, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులపై ప్రభావం ఎక్కువగా ఉన్నదనీ, యువత, కార్మికుల్లో నిరుద్యోగరేటు అనూహ్యంగా పెరిగిందనీ, కార్మికశక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గించిందని ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' ఏప్రిల్ 2021 నివేదిక తెలిపింది. మహిళల విషయానికొస్తే, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం గణనీయంగా పెరి గింది. పురుషులతో పోల్చుకుంటే ఎక్కువగా కార్మికశక్తిలో మహిళల ప్రాతి నిథ్యం పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని గ్రూపుల్లోనూ నిరుద్యోగం పెరగడానికి కోవిడ్-19 కారణమైంది. అన్ని గ్రూపుల్లో సగటు ఉద్యోగరేటు పడిపోయింది.
సుదీర్ఘకాలం నిరుద్యోగం..
ఆయా గ్రూపుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి..ముందు ముందు మరింతగా దిగజారే అవకాశముంది. ఇక అణగారిన వర్గాల్లో కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. వీరి ఆదాయం దెబ్బతింది. కొత్త ఉపాధిని వెతుక్కునే అవకాశాలు లేవు. సుదీర్ఘకాలం నిరుద్యోగం కొనసాగిన తర్వాత వారికి కష్టాలు మరిన్ని పెరిగాయి. కరోనా ప్రభావం కొంత తగ్గినా ఉపాధిరంగంలో పరిస్థితి మారలేదు. కొన్ని రంగాలు పూర్తిగా మూతపడ్డాయి. అక్కడుండే ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆయారంగాల్ని నమ్ముకొని ఉపాధి పొందుతున్నవారు శాశ్వతంగా మునిగిపోగా, కొంతమంది ఎదిగారు..అని ఏప్రిల్ 2021 వరల్డ్ ఎకానమిక్ అవుట్‌లుక్ నివేదిక అభిప్రాయపడింది.