Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేస్బుక్లో 55.3కోట్లమంది వ్యక్తిగత సమాచారం లీక్
- వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, పుట్టిన రోజు.. వేరొకరి చేతికి
కాలిఫోర్నియా : సామాజిక మాధ్యమాల్లో ఖాతాదార్ల వ్యక్తిగత సమాచారానికి భద్రతలేదని మరోసారి రుజువైంది. దాదాపు 55.3కోట్లమంది ఖాతాదార్ల వ్యక్తిగత సమాచారం 2019లో హ్యాకర్లు దొంగలించారని ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఫేస్బుక్' అధికారికంగా వెల్లడించింది. కొన్ని వైరస్ల దాడితో ఖాతాదార్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యింది. లీక్ అయిన సమాచారంలో ఖాతాదార్ల వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీ, ఈమెయిల్ అడ్రస్ తప్ప ముఖ్యమైన ఆర్థిక సమాచారం లేదని'' ఫేస్బుక్ తెలిపింది.