Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 దేశాల్లో 23లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ధ్వంసం
వాషింగ్టన్ : అమెజాన్ అడవులు 17శాతం నష్టపోయాయని తాజా డేటా తెలియచేస్తోంది. బ్రెజిల్లో గతేడాది అటవీ నష్టం 65శాతం వుందని, ఆ తర్వాత స్థానాల్లో బొలీవియా, పెరూ, కొలంబియా అడవులు వున్నాయని పేర్కొంది. పైగా, బొలీవియా, ఈక్వెడార్, పెరూల్లో ప్రాథమికంగా అటవీ నష్టం గతేడాది కనివినీ ఎరుగని రీతికి చేరుకుంది. పర్యావరణ సంస్థ అయిన అమెజాన్ కన్జర్వేషన్ బుధవారం ఈ డేటాను వెల్లడించింది. దక్షిణ అమెరికాలో వర్షాధారిత అమెజాన్ అడవుల్లో గతేడాది 17శాతం మేరా చెట్లను నరికివేశారు. అంటే 9దేశాల్లో దాదాపు 23లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ధ్వంసమైంది. గతేడాది ఆగస్టులో తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఒక ఉమ్మడి లక్షణం కనిపించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. వర్షాధారిత అడవుల్లో తొలుత చెట్లను నరికివేయడం జరుగుతోందని, ఆ తర్వాత తగలబెట్టేస్తున్నారని వెల్లడైంది. దీంతో పెద్ద ఎత్తున దావానలం చెలరేగుతోందని పేర్కొంది. వ్యవసాయ పద్ధతులు ఈ ప్రాంతంలో అటవీ నిర్మూలనకు ఎంత కారణమవుతున్నాయో ఈ డేటా వివరించింది. అమెజాన్వ్యాప్తంగా అటవీ నిర్మూలనకు ప్రధాన కారణం వ్యవసాయం, పశు సంబంధిత అంశాలుగా కనిపిస్తోందని అమెజాన్ ఉపగ్రహ పర్యవేక్షణా ప్రాజెక్టు (ఎంఎఎపి) తెలిపింది.