Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లూన్ బెర్గ్ లెన్స్ లేకుండానే జె-20 స్టెల్త్ యుద్ధ విమానాలు
బీజింగ్ : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ)కి చెందిన, స్టెల్త్ క్షిపణులను తీసుకెళ్ళగల సామర్ధ్యమున్న యుద్ధ విమానం జె-20 యుద్ధ సన్నద్ధతలో మరో స్థాయికి చేరిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. శిక్షణా కాలంలో లేదా యుద్ధేతర ప్రయాణాలు చేసే సమయాల్లో ఇతరులకు స్టెల్త్ విమానమని తెలియచేసే చిన్న పరికరం లూన్బర్గ్ లెన్స్ లేకుండానే ఈ విమానం ప్రయాణించడం కనిపించింది. దాంతో విశ్లేషకులు పై వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాంప్రదాయబద్ధంగా జరిగిన ఒక కార్యక్రమంలో జె-20పైలట్లు, కొరియా యుద్ధంలో వీరోచితంగా పోరాడిన చైనా పైలట్లకు గౌరవ వందనం సమర్పించారని చైనా సెంట్రల్ టెలివిజన్ (సిసిటివి) తెలిపింది. వాంగ్ హెరు ఎయిర్ గ్రూప్లో జె-20 విమానాలు చేరుస్తామని 2019లో పిఎల్ఎ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది. నూతన తరంలోని వైమానిక బలగాల పైలట్లు ''వైమానిక బయోనెట్ పోరాట'' స్ఫూర్తిని వారసత్వంగా తీసుకోవాలని, పోరాట సన్నద్ధతకు శిక్షణ పొందాలని, అన్ని సమయాల్లో యుద్దానికి సన్నద్ధంగా వుండాలని తద్వారా దేశ సార్వభౌమాధికారాన్ని, పరువు ప్రతిస్టలను పరిరక్షించాలని జె-20 యుద్ధ విమాన పైలట్ సన్ టెంగ్ వ్యాఖ్యానించారు. జె-20 వైమానిక విన్యాసాలను టివిలో చూపించారు. ఈ సందర్భంగా లూన్బర్గ్ లెన్స్ వాటికి లేకపోవడం కనిపించింది. పైగా గతంలోని జె-20 యుద్ధ విమానాలతో పోలిస్తే ఇవి భిన్నంగా వున్నాయని సిసిటివి మరో నివేదికలో పేర్కొంది.