Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్, నాటోలకు రష్యా విజ్ఞప్తి
మాస్కో : తూర్పు ఉక్రెయిన్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలను, సైనిక సన్నద్ధతను నిలుపుచేయాల్సిందిగా రష్యా విదేశాంగమంత్రిత్వ శాఖ బుధవారం ఉక్రెయిన్, నాటోలను కోరింది. డాన్బస్లో ఘర్షణలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడానికే తాము మద్దతిస్తు న్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకరోవా ఒక ప్రకటనలో తెలిపారు. డాన్బస్లో, రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘర్షణలను రష్యా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్, మరికొన్ని పశ్చిమ దేశాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని రష్యా గమనిస్తోందని చెప్పారు. డాన్బస్లో కీవ్ సైనిక సన్నద్ధత పైనుండి, ఉక్రెయిన్లో పెరిగిన నాటో సైనిక కారయకలాపాల నుండి, మిన్స్క్ ఒప్పందాలను ధ్వంసం చేయడాన్ని నుండి దృష్టిని మరల్చేందుకే ఈ తప్పుడు ప్రచారమని తాము భావిస్తున్నట్లు జకరోవా పేర్కొన్నారు. డాన్బస్కు ఉక్రెయిన్ కొత్త బలగాలను, ఆయుధాలను పంపుతునే వుందన్నారు. అక్కడ గల తీవ్రవాదులతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఈ ఏడాదిలో వివిధ నాటో దేశాలతో తన భూభాగంలో ఏడు సంయుక్త విన్యాసాలను నిర్వహించేందుకు ఉక్రెయిన్ చర్యలు తీసుకుంటోంది.