Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకు 4వేలకుపైనే మృతి..80వేలకుపైగా కేసులు..
బ్రసీలియా: బ్రెజిల్‌లోని ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించిన తాత్కాలిక దవాఖానాల్లోనూ జాగాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు సరైన చికిత్స అందక చనిపోతున్నారు .ఇప్పటి వరకు 3.37లక్షల మంది చనిపోగా.. కరోనా బారినపడ్డ రోగులు చికిత్సకోసం భయాందోళనలతో బతుకుతున్నారు.
బ్రెజిల్లో బుధవారం చివరి 24 గంటల్లో కరోనా నుంచి 4000 మందికి పైగా మరణించారు. బ్రెజిల్లో మరణించిన వారిసంఖ్య ఇది ఇప్పటివరకు అతిపెద్ద సంఖ్య. దీనికి ముందు అమెరికా, పెరూ దేశాల్లో మాత్రమే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఇక యూఎస్ తరువాత ఎక్కువ కావటం గమనార్హం. రోజూ 80 వేలకు పైగా కొత్త రోగులు వస్తున్నారు. ఆస్పత్రులు నిండిపోయాయి.
డ్యూక్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, బ్రెజిలియన్ వైద్యుడు మిగ్యుల్ నికోలాయిస్ మాట్లాడుతూ.. బ్రెజిల్ ఒక అణు రియాక్టర్ లాగా మారింది, ఇక్కడ కరోనా విరుచుకుపడుతున్నది. ఇది అనియంత్రితంగా మారింది. బ్రెజిల్ కాస్త బయోలాజికల్ ఫుకుషిమాగా మారింది. ఈ భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, దేశ ప్రధాని బోల్సోనారో లాక్‌డౌన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం వైరస్ వల్ల కలిగే నష్టం కంటే ఎక్కువగా ఉంటుందని ఆయన వాదన..
''ఇది బ్రెజిల్ మానవ చరిత్రలో అతిపెద్ద విషాదం'' అని డాక్టర్ నికోలాయిస్ చెప్పారు. తాజా అంచనాల ప్రకారం, సంక్రమణ రేటు అదే విధంగా ఉంటే, జులై 1 నాటికి, మేము 5 లక్షల మరణాలను దాటుతామని ఆయన తెలిపారు.
కొత్త రోగుల సంఖ్య తగ్గిందా..తగ్గిస్తున్నారా..?
యూరోప్‌లోని పెద్ద దేశాలలో రోజువారీ కొత్త రోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, పోలాండ్‌తో సహా యూకేలో గత వారంలో రోజుకు కొత్త రోగుల సంఖ్య సగానికి పైగా తగ్గింది. ఏప్రిల్ 6 న ఫ్రాన్స్‌లో 8054 కేసులు గుర్తించగా..ఫ్రాన్స్‌లో 50 వేల కేసులు వస్తున్నాయి. 90 శాతం ఐసీయూల్లో పడకలు నిండి ఉన్నాయి.మరోవైపు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, స్పెయిన్, బ్రిటన్ సహా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. కాబట్టి ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లుంది. యూకేలో వచ్చే వారం నుంచి రెండవ దశ అన్‌లాక్ ప్రారంభిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 13.3 మిలియన్లకు పైగా జనం కోవిడ్..19 బారిన పడ్డారు. 28.86 లక్షల మంది మరణించారు.