Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్‌లో ఆగిన వీసాలు...
- భారతీయులకు కరోనా కష్టాలు
ఆక్లాండ్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయుల రాకపై న్యూజిలాండ్ నిషేధం విధించింది. భారతీయుల రాకతో న్యూజిలాండ్‌లో ఎంట్రీపై ఏప్రిల్ 11 నుంచి 28 వరకు బ్యాన్పెట్టింది. గత 24 గంటల్లో ఆ దేశంలో.. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు వచ్చిన 17 కేసులను పరీక్షించగా..17 మంది భారతీయులేనని న్యూజిలాండ్ ప్రధాని జాకిందా ఆర్డెర్న్ ప్రకటించారు.
వీరంతా భారతదేశం నుంచి తిరిగి వచ్చారు. కరోనా విజృంభణ పరిగణనలోకి తీసుకున్న అక్కడి ప్రభుత్వం తాత్కాలికంగా నోఎంట్రీ విధించింది. మరోవైపు సింగపూర్ కూడా ఎనిమిదివేల మంది భారతీయుల వీసాలను నిలిపివేసింది. గతేడాది కరోనా కాలంలో సింగపూర్ నుంచి భారతదేశానికి వచ్చిన ఇండి యన్స్ ఇపుడు.. తిరిగి సింగపూర్‌కు వెళ్లాలనుకుం టున్నారు.
భారతదేశం నుంచి వచ్చిన 23 మందిలో 17 మంది కొత్త రోగులు
న్యూజిలాండ్‌లో గత కొద్ది రోజుల్లో 2,531 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా కరోనా కేసులు వస్తున్నాయని ప్రధాని జసిందా ఆర్డెర్న్ అన్నారు. అందువల్ల ఈ తాత్కాలిక నిషేధం విధించినట్టు తెలిపారు.. ఇది న్యూజిలాండ్ పౌరులకు కూడా వర్తిస్తుంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న దేశాలపై మన ప్రభుత్వం కూడా నిఘా పెడుతున్నది. అవసరమైతే, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం కొనసాగిస్తామని ప్రధాని తెలిపారు.
సింగపూర్‌లో 11 వేల మందిపై ఉపాధి నీలినీడలు..
సింగపూర్‌లో పనిచేస్తున్న 11 వేల మంది ఉద్యోగాలు కూడా కోల్పోవచ్చు. వారిలో 7 వేల మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు.. మే 1 లోపు వర్క్ పర్మిట్ పొందాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీకి విదేశీ కార్మికుల కోటా ఉంటేనే అనుమతి ఇస్తారు. అయితే ఈ ఉత్తర్వు వెనుక సింగపూర్ ప్రభుత్వం ఉద్దేశమేమిటంటే.. స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించాలన్నదే.
దరఖాస్తు చేసినా వీసా ఇవ్వట్లే..
బెస్టిన్ బెనిన్ వివాహం కోసం గతేడాది మార్చి 20 న భారత్‌కు వచ్చాడు. సింగపూర్‌కు తిరిగి వెళ్లటానికి 12 సార్లు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా, అనుమతిలభించలేదని బెనిన్ తెలిపాడు. అలానే తన తండ్రి శస్త్రచికిత్స కోసం ఐటీ నిపుణుడు వి.రెడ్డి హైదరాబాద్ వచ్చారు. అతను తిరిగి సింగపూర్‌కు వెళ్లటానికి 22 సార్లు దరఖాస్తు చేసినప్పటికీ అనుమతిరాలేదు. అక్కడ ఉద్యోగం ఉన్నా వెళ్లలేనిపరిస్థితి..ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసు కుందామనుకుంటే నో వెకెన్సీ అంటున్నారని వి.రెడ్డి తెలిపారు.