Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాక్బర్న్ టౌన్: కొవిడ్‌పై పోరులో భాగంగా టర్క్స్, కైకోస్ దీవుల్లో గత 9మాసాలుగా సేవలందిస్తున్న క్యూబన్ వైద్య బృందం ఇప్పటివరకు 101మంది ప్రాణాలను కాపాడిందని దౌత్యవర్గాలు తెలిపాయి. గతేడాది జూన్ 14న హవానా నుండి 20మందితో కూడిన ఆరోగ్య నిపుణుల బృందం ఈ ప్రాంతానికి చేరుకుంది. ఇప్పటివరకు వారు 13,224 మెడికల్ కన్సల్టేషన్స్ అందచేశారు. 42,308 నర్సింగ్ ప్రొసీజర్లు చేపట్టారు. 123 ఆపరేషన్లు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో, విపత్తుల్లో సేవలందించగల హెన్రీ రీవె అంతర్జాతీయ వైద్య బృంద సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్ ఐకాన్స్ అవార్డును అందుకున్నారు. వైద్య బృందం అధినేత అల్ఫ్రెడో మోరాన్ ఈ మేరకు ప్రెన్సాలాటినాకు ఒక సందేశం పంపుతూ, అవార్డు ఇవ్వడం ద్వారా తమకు గుర్తింపునిచ్చినా ప్రజల ప్రాణాలను కాపాడడమే అన్నింటికంటే అద్భుతమైన బహుమతని వ్యాఖ్యానించారు. స్థానికులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40దేశాల్లో తాము నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో భాగమే ఈ పనులని చేప్పారు.