Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓస్లో: కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే సామాన్యుడికే శిక్షలు అనుకుంటే పొరపాటు. సామాన్యుడి కైనా, ప్రధానికైనా ఒకటేనంటోంది నార్వే. కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా...పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నందుకు నార్వే ప్రధానికి అక్కడ పోలీసులు భారీ జరిమానా విధించారు. సుమారు ఆమెకు 20 వేల నార్వేజియన్ క్రోన్లు (లక్షా 75 వేల రూపాయలు) జరిమానా వేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఏ వేడుకైనా 10 మందికి మించి అతిధులు హాజరు కాకూడదు. కానీ ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ గత నెలలో తన 60వ పుట్టిన రోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.