Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా: ప్రకృతి వైపరిత్యాలకు కేరాఫ్ అడ్డాగా నిలిచిన ఇండోనేషియా మరోసారి భూకంపం బారిన పడింది. జావా ద్వీపం తీరంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 శాతం తీవ్రతగా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తూర్పు జావాలోని మలంగ్ నగరానికి నైరుతి దిశలో 45 కిలో మీటర్ల దూరంలో... 82 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఆస్తి, ప్రాణ నష్టం గురించిన సమాచారం తెలియాల్సి ఉంది. అక్కడ ఒక్కసారిగా భూమి కంపించడంతో మలంగ్ ప్రజలు భయభ్రాంతులకు లోనై.. బయటకు పరుగులు తీశారు. చాలా రోజుల తర్వాత తీవ్ర భూకంపం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.